కట్టుకథలు..పిట్టకథలెందుకు..బాబూ..!!
చoద్రబాబు పిట్టకథలు చెప్పడంలో దిట్ట. తోటకూర కథనైతే మరింత ఆసక్తిగా చెబుతారు. కోవూరులో ఆయన ఈ కథనే నమ్ముకున్నారు. దివంగత రాజశేఖరరెడ్డి పైనా., ఆయన కొడుకు జగన్ పైనా.. శాశ్వత శత్రుత్వాన్ని పెంచుకున్నారని చద్రబాబు మాటల్లో తెలుస్తూనే ఉంది. అయితే జనం ఆయన అనుకున్నంత వెర్రివాళ్ళు కాదనే విషయాన్ని టిడిపి ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. తనదాకా వస్తే.. కోర్టు కేసుల్ని తప్పించుకోవడానికి నానా తంటాలు పడే పెద్దమనిషి జగన్ విషయంలో మాత్రం పిట్ట కథలు చెప్పి జనాన్ని నమ్మించాలని చూస్తాడు. వినేవారుంటే కథలు చెప్పడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఎక్కడిదాకో ఎందుకు.. చంద్రబాబు బహిరంగ సభలకు తోలుకొచ్చిన జనంలో ప్రతి ఒక్కరూ ఎడతెరిప లేకుండా కథలు చెప్పగలరు. ఇంతకీ చంద్రబాబుకు వేరే అంశాలేవీ గుర్తుకు రావా..? వచ్చినా వాటిని వదిలేసి.. తోటకూర కథనే వల్లెవేస్తారా..? రాష్ట్రంలో సవాలక్ష సమస్యలున్నాయి. మూడు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.వాటన్నింటినీ పట్టించుకోని చంద్రబాబు దివంగత రాజశేఖరరెడ్డి పైనా ఆయన కొడుకు జగన్ పైనా మాత్రమె కథలు ఎక్కుపెడుతున్నరంటేనే ఆయన అక్కసు అర్థమవుతోంది. జగన్ ఎక్కడికీ పారిపోలేదు. అనునిత్యం జనంలో ఉంటున్నాడు. చంద్రబాబుతో పాటు కోవూరులో ప్రచారం చేస్తున్నాడు. జగన్ ఇంతవరకూ రాష్ట్రానికి చెందిన ఏ ఉన్నత పదవిలోనూ లేడు. ఆయనపై అవినీతి మరకలు చిలకరించింది ఇటు చంద్రబాబు, అటు కాంగ్రెస్ లోని కొందరు పదవుల్లేని పాతకాపులే. వీళ్ళను గురించి ప్రజలకు తెలీదా..? తెలియదని వీళ్ళు భ్రమిస్తున్నారా..? తెహల్కా చంద్రబాబును తెగనాడినపుడు టిడిపి నోరేత్తలేకపోయిందే౦..? ఆయన అవినీతిని ఆధారాలతో సహా వెల్లడించినపుడు మౌనం వహించడం వెనక అర్థం ఏమనుకోవాలి. ఏలేరు కుంభకోణంలో బాబుగారి నిజాయితీ బయటపడినా.. జనం చెవిలో పూలు పెట్టే రాజనీతిని టిడిపి చక్కగా ఆచరిస్తోంది. ఈ కథలన్నింటినీ జగన్, ఆయన పార్టీ వర్గాలు వల్లెవేయవచ్చు. జనం ముందు కుప్పిగంతులు తగవనే తగ్గివుంటున్నట్టు.. కనబడుతోంది. జగన్ నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కుర్రాడు. చంద్రబాబుకున్న అనుభవం ముందు జగన్ ఎందుకూ పనికిరాడు. అంత అనుభవం ఉన్న.. పరిణితి చెందిన రాజకీయనేత... చనిపోయిన వ్యక్తిపై అవాకులూ చవాకులూ పేలుతూ.. పిట్టకతలతో పోద్దుపుచ్చుతారా ..? జాతీయ రాజకీయాలను ఒంటి చేత్తో చక్రం తిప్పి నడిపించిన చంద్రబాబు... కేవలం రెండు మూడేళ్ళ రాజకీయానుభవం ఉన్న జగన్ పై ఒంటికాలిపై లేస్తూ నోటికొచ్చినట్లు పెలదాన్ని ఆయన విజ్ఞతకే వదిలేయాలి. భావి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవాల్సిన చంద్రబాబు ఇప్పటికైనా హుందాగా మాట్లాడతారని.. ఆశిద్దాం!!
-శివరాం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి