బాలయ్య... `బావ'తో కలిసి పనిచేస్తాడా ..?
సినిమాలు
తగ్గాయో ..? బావ బాధ చూడలేక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడో...?
తెరవెనక తతంగం ఏమిటో గానీ ... విగ్గు చేరక్కుండా రా జకీయల్లొనూ రంగుల
హంగులద్దుకోవాలని తెగ ఉబాలాటపడుతున్నాడు బాలయ్య...! తన రాజకియ
ఆరంగ్రేటానికి భారీ డైలాగులతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్టు
కనబడుతోంది. చిరంజీవి రాజకీయ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాక ఇక బాలయ్య వంతు
వచ్చింది. రాష్ట్రంలో 1983 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. జగన్ లాంటి యువ
నాయకుడు ఆనాడు ఎన్టిఆర్ కు తారసపడలేదు. అప్పటికే కుంగి కునారిల్లిన
కాంగ్రెస్ పై ఎన్టిఆర్ ఒంటికాలిపై లేచినా..ఈనాడు అధినేత రామోజీ రావు
తెరవెనక మంత్రాంగం నడిపినా అప్పటి ప్రజాభిప్రాయం వేరు. ఇప్పటి పరిస్థితులు
వేరు. అప్పట్లో కాంగ్రెస్ రాజకీయాలపై జనం పూర్తి ఏవగింపుతో ఉన్నారు. ఆనాడు
కాంగ్రెస్ కు సరైన ప్రతిపక్షమే లేదు. ఇప్పుడు అధికార పక్షంపైనా..., ప్రథాన
ప్రతిపక్షంపైనా జనం విరక్తితో మార్పును కోరుకుంటున్నారు. రాష్ట్ర
రాజకీయాలను శాసించగల అనేక జిల్లాల్లో.., ప్రాంతాల్లో జగన్ పర్యటించి జనంతో
మమేకమవుతున్నారు. ఆయనకు అపూర్వ జనాదరణ లభిస్తోంది. ఒకపక్క కాంగ్రెస్..,
టిడిపి లు ఏకమై జగన్ రాజకీయ పునాదుల్ని కదల్చాలని.. సిబిఐ ని ఉసిగొల్పి
రకరకాల ఎత్తుగడలతో ఇబ్బందులు పెడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ఒంటరి పోరు
సాగిస్తున్న జగన్ ఇప్పుడు ఆరెండు పార్టీలకు సింహస్వప్నంగా మారారనడంలో
సందేహంలేదు. సరిగ్గా ఈ దశలోనే బాబుకు బాసట కావల్సివచ్చిoది. చంద్రబాబు
పర్యటనల కోసం ఆపార్టీ నాయకులు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఎంతగా జనాన్ని
బతిమాలి తీసుకొచ్చినా పార్టీ పరువు దక్కించుకోవడం కష్టంగా మారింది.
చంద్రబాబు ప్రసంగాలకు జనస్పందన ఏమాత్రం లభిస్తోందో కనబడుతూనేవుంది.
టియ్యారెస్ స్పీడు తగ్గించిన ఈ తరుణంలోనూ టిడిపి అధినేత వరంగల్ జిల్లా
పర్యటన కోసం ఆపార్టీ నాయకులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రాష్ట్ర
రాజకీయాల్లో టిడిపి శకం ముగిసినట్టు భావించే పరిస్థితి ఏర్పడిందని ఆపార్టీ
నాయకులే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు చెదిరిపోయాయి. నాయకులు
మాత్రమే మిగిలారు. వారిలోనూ అభద్రతా భావం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ కాలం ఉంది. ఎంత ఊదరగొట్టినా చంద్రబాబు
మాటలకూ.. చేతలకు విలువ తగ్గినట్టు టిడిపి వర్గాలు గుర్తించాయి. అధినేత వెనక
అందరిదీ ఒకటే అభిప్రాయం. నాయకత్వం మారాలి. కొత్త నాయకుడి నేతృత్వాన 2014
ఎన్నికల్లో పాల్గొనాలి. ఈమేరకు ఇంటిపోరు పెరిగిపోవడంతో చంద్రబాబు కొత్త
ఎత్తుగడగా బావమరిదిని రంగంలోకి దించారు. టిడిపి మునిగోపోతున్న నవలా తయారైన
స్తితిలో బాలయ్య వచ్చి మాత్రం చేసేదేముందని ఆపార్టీ సీనియర్లు పెదవి
విరుస్తున్నారు. సినీ గ్లామర్ కు ఏమాత్రం విలువ ఉంటుందో చిరంజీవి రాజకీయ
ప్రస్థానాన్ని చూస్తే అర్ధమవుతుంది. ఇది ఎన్టిఆర్ నాటి కాలం కానేకాదని
ఇప్పటికైనా టిడిపి సీనియర్లు గుర్తించక పోవడంవల్లనే బాలయ్య బరిలోకి
దిగాల్సివచ్చింది. ఆయన తోడకోట్టినా.. మీసం మేలేసినా ముచ్చటపడి
ఈలలేస్తారేమోగానీ ఓట్లు వేస్తారనే గ్యారంటి ఎంతమాత్రంలేదు. ఈవిషయం
చంద్రబాబుకూ తెలుసు. అయినా తానొక్కడే భంగపడటంకన్నా బావమరిదిని కూడా
రంగంలోకిదించి.. ఆయనోచ్చినా ఒరిగిందేమిలేదని ఇంకా దింపుడుకళ్ళం ఆసతో ఉన్న
నాయకులకు చెప్పి తప్పించుకోవచ్చనేది చంద్రబాబు ఎతుగడ. బాలయ్యను
బలవంతంగానైనా ఊరూరు తిప్పితే హరికృష్ణ కానీ ఆయన కొడుకు జునియర్ ఎన్టీయార్
కానీ టిడిపి చాయలకు వచ్చే ఆవకాశం ఉండదు. జ్యోతిష్యానికి అత్యంత విలువిచ్చే
బాలకృష్ణ టిడిపి జాతకాన్ని ఏనాడో తెలుసుకున్నారు. అయినా బావకోసం .. బావ
కళ్ళలో కనిపించే ఆనదం కోసం మరో శీను బలికాబోతున్నాడనే బాధ పాపం
పురందేశ్వరిలో కనిపిస్తోంది. జనం మాత్రం మరింత వినోదం కోసం వేయి కళ్ళతో
ఎదురుచూస్తున్నారు. మనమూ వేచిచూద్దాం...!
-శివరామ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి