21, జనవరి 2012, శనివారం


 పరువు తీస్తున్న పత్రికల రాజకీయాలు....!
జగన్ రాజకీయాలు అటు కాంగ్రెస్ ను ఇటు టిడిపి ని ఇరుకున పెడుతున్నాయి. సీమంధ్రలో జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో సుమారు మూడు నెలలుగా సాగుతున్న యాత్రకు మంచి స్పందనే కనిపించింది. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేని అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం సిబిఐ ని అడ్డుపెట్టుకుని కక్ష సాధిస్తోంది. సిబిఐ ని  పావులా వాడుకుంటోంది. సిబిఐ విచారణ ప్రారంభమైన నాటినుంచి రాష్ట్రంలోని రెండు ప్రధాన దిన పత్రికలు అనునిత్యం జగన్ అంశాన్నే ప్రధానంశంగా ప్రచురిస్తున్నాయి. తద్వారా జగన్ కు మరింత ప్రచారం లభిస్తోందే తప్ప నష్టం జరగడం లేదు. సిబిఐ విచారణ వెనుక టిడిపి కి చెందిన మాజీ మంత్రి ఒకరు ఉన్నారనే విషయం గతంలోనే వెల్లడైంది. ఆయన కనుసన్నల్లోనే.. సలహాలు.. సూచనల మేరకే సిబిఐ పనిచేస్తున్నదనే ఆరోపణలు వచ్చాయి. ఒకరకంగా సిబిఐ విచారణ ద్వారా బయటపడే అంశాల మాట అటుంచితే ప్రస్తుతం పత్రికల మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తున్నట్టు కనబడుతోంది. మూడు దశాబ్దాల ఆధిపత్యాన్ని పోగొట్టుకోలేని ఈనాడు ఎంతకైనా తెగించడానికి సిద్దపడుతోంది. టిడిపి వర్గాలు నడుపుతున్న ఆంధ్రజ్యోతి ప్రత్యక్షంగానే ఈనాడుకు సై అంటోంది. రెండు పత్రికల బరి తెగింపు వల్ల సాక్షికి ఎనలేని గుర్తింపు వచ్చినమాట నిజం. రాజకీయ రొంపిలో గొంతులోతు కూరుకుపోయిన పై రెండు పత్రికలు తమ నిస్పాక్షికతను రుజువు చేసుకోలేకపోతున్నాయి. ఫలితంగా ప్రజల మధ్య తలెత్తుకు నిలబడాల్సిన పత్రికలు  రాజకీయాల మాటున బతుకాల్సిన దుస్థితికి చేరుకున్నాయి. జర్నలిజం విలువల వలువలూడ్చి నడిబజారులో నిస్సిగ్గుగా నిలబెట్టిన ఘనత రెండు పత్రికలకే దక్కుతుంది. ఇప్పుడు సాక్షిని ఏఒక్కరూ భుజనేసుకోవాల్సిన అవసరం లేకుండానే అస్తిత్వ పోరులో అనవసర ప్రచారాన్ని రెండు పత్రికలు కల్పిస్తున్నాయి. జగన్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చడానికి ఇటీవల జరిపిన రైతు దీక్ష వంటి పోరాటాలు చాలు. తెలంగాణలొనూ జగన్ కు, ఆయన పార్టీకీ బలమైన పునాదులు ఉన్నాయనడానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిపిన పోరాటమే ఉదాహరణ. తెంగాణలో లభించిన అపూర్వ ఆదరణ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి నూత్నోత్తేజన్నిచ్చింది. అధికార పక్షం, ప్రతి పక్షం ఉబలాట పడ్డట్టు   సిబిఐ విచారణ పేర జగన్ ను వేధించి చివరకు జైలుకి పంపాలనే ఎత్తుగడ ఫలించినా.. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మరింత మేలు చేకూరుస్తుందే తప్ప నష్టం జరిగే పరిస్థితులు కనబడడం లేదు. ఎటొచ్చీ పచ్చ పత్రిక పరువు పోవడం ఒక్కటే ఆఖరి అంకంగా మిగిలిపోవచ్చు.


జనాదరణ ఉన్న నేత జగన్: గాదె
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి నాయకత్వ
లక్షణాలు లేవని ఎవరు అంచనా వేసినా తప్పేనని మాజీ మంత్రి గాదె
వెంకట రెడ్డి అన్నారు. జగన్కు జనాదరణ ఉందన్నారు. ఆయన సభలకు
జనం విపరీతంగా వస్తున్నారని గాదె గుర్తు చేశారు. ఆయనకు రాజకీయ
లక్షణాలు లేవని తానెన్నడూ అనలేదన్నారు. సీనియర్ల సేవలు అవసరం లేదని
పార్టీ భావిస్తోందేమోనన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో
కులభావన పెరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు కులాల
ప్రాతిపదికనే టికెట్లు ఇస్తున్నాయని, విధానం సరికాదని గాదె అన్నారు.
కేబినెట్లో తెలంగాణ ప్రాంతానికి ప్రాంతీయ సమతుల్యత దెబ్బతిందన్నారు.
దామాషా ప్రకారం తెలంగాణ ప్రాంతానికి మరికొన్ని మంత్రి పదవులు రావాలని
పరోక్షంగా ముఖ్యమంత్రికి ఆయన చురకలంటించారు.

జగన్ వెంట జనం: ఎంపి రాయపాటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి
ప్రజాదరణ గల నాయకుడన్న మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యలతో
తాను పూర్తీగా ఏకీభవిస్తున్నట్లు ఎంపి రాయపాటి సాంబశివరావు చెప్పారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు వంద శాతం వాస్తవం అన్నారు. కనపడుతుంది గదా,
జగన్ వెంట జనం వస్తున్నారు అని అన్నారు.కమ్మవారిని టాయిలెట్ పేపర్
లాగా వాడుకొని పారవేస్తున్నారని బాధపడ్డారు. మంత్రి వర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి
మరింత స్వేచ్చ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవులు
తీసుకున్నవారు రానున్న ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత
తీసుకోవాలన్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లు ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తేనే ఎన్నికలలో పార్టీ
గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

23 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా సమావేశాలు
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత
వ్యవహారాలపై చర్చించడానికి నెల 23 తేదీ నుంచి జిల్లాల వారీగా
విస్త్రత సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. తొలి విడతగా
రోజు కొకటి చొప్పున ఐదు జిల్లాల సమావేశాలు పార్టీ కేంద్ర కార్యాలయంలో
జరుగుతాయి. 23 నిజామాబాద్, 24 నల్లగొండ, 25 మహబూబ్నగర్,
27
ఆదిలాబాద్, 30 తేదీన కరీంనగర్ జిల్లాల సమావేశాలు ఉంటాయని
పార్టీ సంస్థాగత వ్యవహారాల సమన్వయకర్త పి.ఎన్.వి.ప్రసాద్ జిల్లా
అడ్హాక్ కమిటీ కన్వీనర్లకు లేఖలు పంపారు. విస్త్రత సమావేశాల్లో పార్టీ అడ్హాక్
కమిటీ జిల్లా కన్వీనర్లు, పరిశీలకులు, జిల్లా సమన్వయకర్తలు, స్టీరింగ్
కమిటీ సభ్యులు, మండల పార్టీ అడ్హాక్ కన్వీనర్లు, మున్సిపాలిటీ కన్వీనర్లు,
అనుబంధ విభాగాల అధ్యక్షులు, కన్వీనర్లు, అధికార ప్రతినిధులు, జిల్లాల్లోని
పార్టీ ముఖ్య నేతలు, ఇతర జిల్లాల్లో పార్టీ విధులు నిర్వహిస్తున్న నాయకులు,
కేంద్ర పాలక మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంటు
సభ్యులు పాల్గొనాలని ఆయన సూచించారు. సమావేశానికి పై వారంతా పాల్గొనేలా
సంబంధిత జిల్లా కన్వీనర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని
ఆయన అన్నారు. ఆహ్వానితులు సమావేశానికి వచ్చేటపుడు తమ ఫోటోలు
రెండింటిని తీసుకురావాలని కూడా ఆయన సమాచారం పంపారు. కమిటీల
ఏర్పాటుపై శ్రద్ధ పార్టీ సభ్యత్వ కార్యక్రమం వేగవంతం చేసేందుకు వీలుగా ఆయా
జిల్లాల్లో అన్ని స్థాయిల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయడంపై సమావేశంలో
ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పార్టీ అనుబంధ
విభాగాల అధ్యక్షులను నియమించారు. వారంతా మేరకు మండల కమిటీలను
ఏర్పాటు చేశారనే అంశం కూడా ప్రస్తావనకు రావచ్చు. కొత్తగా ఏర్పడిన పార్టీ
కనుక వివిధ శ్రేణుల, నాయకుల విధులను, బాధ్యతలను గురించి
సమావేశంలో స్పష్టంగా నిర్దేశిస్తారు. సంస్థాగత నిర్మాణానికి సంబంధించి
కీలకమైన అంశాలు చర్చిస్తారు కనుక సాధ్యమైనంత వరకూ ఆహ్వానితులందరినీ
సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఇప్పటికే జిల్లా కన్వీనర్లకు ఆదేశాలు వెళ్లాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి