రాజీనామాకు చిదంబరం సిద్ధం
2జీ స్పెక్ట్రమ్ స్కామ్లో తన పాత్ర లేదని సీబీఐ ట్రయల్ కోర్టు నిర్ధారించినప్పటికీ.. తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. 2జీ స్కామ్లో తన పాత్ర లేదంటూ సీబీఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషంగా ఉందన్నారు. అదేసమయంలో తనకు వ్యతిరేకంగా ప్రత్యేక కోర్టులో తీర్పు వచ్చివుంటే రాజీనామా చేసేవాడినని ఆయన చెప్పారు. ఆ సమయంలో రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు.. 2జీ స్కామ్లో చిదంబరం పాత్రపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ కేసులో చిదంబరానికి ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టు తీర్పు వెలువరించింది.
చిదంబరానికి అంతా
తెలుసు: రాజా
2జీ స్కామ్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన ప్రతి అంశం నాటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి చిదంబరానికి అంతా తెలుసని కేంద్ర టెలికామ్ శాఖ మాజీ మంత్రి, 2జీ స్కామ్లో ప్రధాన నిందితుడైన ఏ.రాజా చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన అన్ని నిర్ణయాలన చిదంబరం ఆయన బృందం తీసుకుందని చెప్పారు. దీనిపై రాజా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. 2జీ లైసెన్సుల కేటాయింపునకు సంబంధించి అన్ని నిర్ణయాలను 2003లో అప్పటి కేబినెట్ నిర్ణయం తీసుకుందని, అలాంటపుడు తన క్లెయింట్ను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అందువల్ల ఈ కేసులో సెక్షన్ 311 ప్రకారం చిదంబరాన్ని ఒక సాక్షిగా పరిగణించాలని కోరారు. ఈయన ప్రధానమంత్రికి సలహాలు, సూచనలు ఇచ్చారా లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఐఏఎస్
అధికారులు ఒకరు చెపితే
తప్పు చేసేందుకు పాలు
తాగే పసిపిల్లలేం కాదని
రాష్ట్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నేత
జేసీ.దివాకర్ రెడ్డి
అభిప్రాయపడ్డారు.
ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రులు చెప్పినట్లు చేశామని ఐఏఎస్
అధికారులు చెప్పడాన్ని ఆయన
తప్పుబట్టారు. ఒకరు చెప్పినట్టు చేయడానికి అధికారులేం చిన్న
పిల్లలు కాదన్నారు. మంత్రులు చెప్పినట్లు తాము
చేశామని చెప్పడాన్ని ఆయన
తప్పుపట్టారు. అక్రమాలలో తమ
బాధ్యత లేదని చెప్పడం సరికాదన్నారు. ఆపద
వచ్చిందని మంత్రులపైకి తప్పు
నెట్టేయడం సరికాదన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలు
చేయాల్సిన బాధ్యత ఐఏఎస్
అధికారులపై ఉందన్నారు. ఆ
నిర్ణయాల్లో ఏవైనా లోపాలు
ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యతా అధికారులపైనే ఉందని
ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన పెద్ద
చేపల (మంత్రులు) పేర్లను వెల్లడించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డొక్కా
మాణిక్య వరప్రసాద్ రావు
డిమాండ్ చేశారు. శనివారం ఐఏఎస్లు చేసిన
ఆరోపణలపై ఆయన ఆదివారం స్పందించారు. దీనిపై
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ
అంశాలకు సంబంధించి దర్యాప్తు సాగిస్తున్న సీబీఐని ఐఏఎస్
అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తప్పు
ఎవరు చేసినా శిక్ష
తప్పుదని ఆయన హెచ్చరించారు. ఐఏఎస్
అధికారులు అవినీతి మంత్రుల పేర్లు
బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
పెద్ద చేపలు.. చిన్న
చేపలు అనేది ఇక్కడ
సమస్య కాదని, తప్పు
ఎవరు చేసినా తప్పు
తప్పేనన్నారు. అందువల్ల తప్పు
చేసిన మంత్రుల పేర్లు
ఐఏఎస్ అధికారులకు తెలిస్తే బహిర్గతం చేయాలన్నారు. అంతేకాకుండా, మంత్రుల నుంచి
వచ్చిన ఒత్తిడి మేరకే
తాము ఇలా నడుచుకున్నామని అధికారులు చెప్పడాన్ని ఆయన
తప్పుబట్టారు.
సిరియాలో తాజాగా
చెలరేగిన అల్లర్లలో మరో
48 మంది మృతి చెందినట్టు రైట్స్
గ్రూప్ వెల్లడించింది. ఈ
మృతుల సంఖ్యతో మొత్తం
మృతుల సంక్య 240కు
చేరుకుంది. గత కొన్ని
రోజులుగా సిరియా ప్రభుత్వ దళాలు
ఆందోళనకారులపై
పాశవిక దాడులు జరుపుతున్న విషయం
తెల్సిందే. ఈ దాడుల్లో 200 మంది
మృతి చెందారు. అధికారం కాపాడుకునే ప్రయత్నంలో అధ్యక్షుడు బషర్
అసద్ క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ
ఆందోళనకారులపై
సిరియా ప్రభుత్వ దళాలు
శనివారం మోర్టార్లతో శతఘ్ని
దళాలతో విరుచుకుపడ్డాయి. ఈ
ఘర్షణల్లో 200 మంది చనిపోయారని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి