అసెంబ్లీలో వేరుగా కూర్చుంటాం: మేకపాటి
తమ పార్టీ కండువాతోనే తాము అసెంబ్లీకి వెళతామని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి స్పష్టం చేశారు. తమ పదిహేడు మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని సభాపతి నాదెండ్ల మనోహర్ను కోరతామన్నారు. స్పీకర్ తమపై వేటు వేసినా ఉప ఎన్నికలకు భయపడే సమస్యే లేదన్నారు. కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలకు భయపడే తమ అనర్హత వేటు విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెసు ఉందన్నారు. సభలో రైతు, చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.
ప్రభుత్వానికి కవిత డిమాండ్
సూట్కేసుల సంస్కృతి నిజమే: కావూరి
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెసు ఎంపి కావూరి సాంబశివ రావు సమర్థించారు. ఆయన మీడియాతో మాట్లాదుతూ సూటుకేసులు ఇచ్చి మంత్రి పదవులు పొందే సంస్కృతి కాంగ్రెసు పార్టీలోనే లేదని అన్ని పార్టీలలో ఉందని ఆయన అన్నారు. దేశం కోసం పని చేసే రాజకీయ నేతలు కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదన్న భావన చాలామందిలో ఉందన్నారు. పార్టీలో కొందరికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని, ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు ఇది రుచించడం లేదన్నారు.
విడిపోయినా... భర్త ఇంట్లో భార్యకు స్థానం : సుప్రీం
మరి లోకేష్ మాటేమిటి... ?... అంబటి
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, తన తనయుడు లోకేష్ కుమార్ను స్టాన్ఫర్డ్లో చదివించడానికి రూ.60 లక్షల సొమ్మును వేరెవరితో కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి గురించి యువతకు ఎందుకు చెప్పడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి
అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబును నేటి యువత ఏం చూసి ఆదర్శంగా తీసుకోవాలని అడిగారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచినందుకా, తోడల్లుడిని, బావమరిదిని, తమ్ముడిని వాడుకొని వదిలేసినందుకా, ప్రజా ఉద్యమాలు అణిచి వేసినందుకా లేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేయించి యువతకు ఉద్యోగాలు లేకుండా చేసినందుకా దేనిని చూసి నేర్చుకోవాలన్నారు.
ఆయన ఘనత గురించి ఇతరులు చెప్పాలి కానీ... ఊరూరు తిరిగి చరిత్ర తెలియని
కుర్రాళ్ళను పోగేసి సొంత డబ్బా కొట్టుకుంటే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో ఆయన మంచి పాలన ఇస్తే అదే ప్రజలు ఆయనను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. రెండుసార్లు వరుసగా ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు.
మళ్లీ సినిమాల్లోకి... నయనతార
నయనతార, ప్రభుదేవాలపై రకరకాల వార్తలు గుప్పు మంటున్న నేపధ్యంలో తాను మళ్లీ సినిమాలూ నటిస్తానని ఆమె వెల్లడించింది. నయనతారని ..ప్రభుదేవా మోసం చేశాడ౦టూ ఆమె బంధువులు నిన్నా మొన్నా మీడియాకు తెలిపారు.. మరో ప్రక్క ప్రభుదేవా..ఒక్కడే కాళహస్తి గుళ్లో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. ‘‘నా చుట్టూ ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే’’ అంటూ నయనతార తమిళ మీడియాకు చెప్పడంతో అంతా హ్యాపీ ఫీలయ్యారు. ఇప్పటికే నాగార్జున సరసన ఆమె ఓ సినిమా కమిట్ అయ్యారు. తమిళంలో అజిత్ సరసన ఓ సినిమా చేయబోతున్నారని వార్త. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ చిత్రాలకు నయనతార కోటి నుంచి కోటిన్నరలోపు డిమాండ్ చేసి తీసుకుంటున్నారట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి