ఇప్పుడు మీటింగ్ వల్ల ఉపయోగం సున్నా- హరి
రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి ఎన్
కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడు ఏర్పాటు చేసిన సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనకాపల్లి ఎంపీ
సబ్బం హరి అన్నారు. రైల్వే బడ్జెట్ దాదాపు తుది
మెరుగులు దిద్దుకున్నాక, ఇప్పుడు ప్రతిపాదనల వల్ల
ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి ఉపయోగం ఉండదని భావించడం వల్లే తాను
సమావేశానికి
వె ళ్లలేదని ఆయన
అన్నారు. రైల్వే బడ్జెట్లో
రాష్ట్రానికి
జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్లో
ప్రస్తావించడానికి
ప్రయత్నిస్తే..
కాంగ్రెస్ నాయకులే అడ్డుకున్నారని సబ్బం హరి
అన్నారు.
చీఫ్ విప్‑గా గండ్ర వెంకట రమణారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా
గండ్ర వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. అలాగే విప్లుగా ద్రోణంరాజు శ్రీనివాస్, పేర్నినాని, ఆరేపల్లి మోహన్, అనిల్, తూర్పు జయప్రకాష్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది . శాసనమండలి నుంచి రుద్రరాజు పద్మరాజు ఎంపికయ్యారు. మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ గండ్ర వెంకటరమణారెడ్డి అసమ్మతిని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‑కుమార్ రెడ్డి మొత్తానికి చీఫ్ విప్‑తో
సహా అయిదు విప్ పదవులను భర్తీ చేశారు.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి