అసెంబ్లీలో గందరగోళం... రేపటికి వాయిదా
శాసనసభ విపక్షాల గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడి౦ది.
తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్ఎస్, బేజేపీ,మద్యం సిండికేట్లు ఏసీబీ
నివేదిక మంత్రి, బంధువుల ప్రమేయంపై టీడీపీ, జూనియర్ డాక్టర్ల సమ్మె రోగుల
ఇక్కట్లుపై సీపీఎం, సీపీఐలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అయితే
సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్
నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులు వాయిదా
తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఫ్లకార్డులతో విపక్ష
సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు
సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ఆతర్వాత కూడా
పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రెండుసార్లు వాయిదా పడిన శాసనసభ
విపక్షాల నిరసనల మధ్య రేపటికి వాయిదా పడింది.
ఆనిర్ణయం ఏమిటో అసెంబ్లీలో చెబుతా: కిరణ్
వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులపై వేటుకు సంబంధించి తమ నిర్ణయం ఏమిటో
అసెంబ్లీలో వెల్లడిస్తానని ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా
పడిన అనంతరం ఆయన
మీడియాతో మాట్లాడారు. జగన్
ఎమ్మెల్యేల వేటు స్పీకర్ పరిధిలోని అంశమన్నారు. దానిపై
ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. స్పీకర్‌ను
పార్టీ గానీ, ప్రభుత్వం గానీ
మరెవరైనా ప్రభావితం చేయలేరన్నారు. ఉప
ఎన్నికలకు తాము సమాయత్తమవుతున్నామని చెప్పారు. మద్యం
సిండికేట్లపై ఎసిబి ప్రాథమిక విచారణ
జరుపుతోందన్నారు.
ఎసిబి నివేదికను తాను
అసెంబ్లీలో ప్రకటిస్తానని చెప్పారు. మంత్రి
డిఎల్ రవీంద్రా రెడ్డి
తనకు ఆరోగ్యం బాగా
లేదని లేఖ రాశారన్నారు. సూటుకేసులాంటి సందర్భం లేని
వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. కడప
జిల్లా నేతలు, కార్యకర్తల స్పందన
బాగుందన్నారు.
జూడాల సమ్మె విషయం
మంత్రివర్గ ఉపసంఘం చూసుకుంటుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత
మంచిదన్నారు.
తీర్మానం కోసం పట్టుపడతాం : ఈటెల
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని, అప్పటి వరకు శాసనసభ కార్యక్రమాలను సాగనివ్వబోమని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలకు మద్యం తప్ప తెలంగాణ అంశం కనబడటం లేదని విమర్శించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు కలిసారు. తెలంగాణ పై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని సీఎంతో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం ఐదు రాష్ట్రల ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం ఉంటుందని తెలిపారు.
సోనియాతో
వివేకా...
రాష్ట్ర
మాజీ
మంత్రి వైఎస్
వివేకానందరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.
రాష్ట్ర రాజకీయాలు,
ప్రస్తుత పరిస్థితులపై సోనియాతో చర్చించారు.
రాజ్యసభకు
ఖాళీలు ఏర్పడుతున్నందున
తనకు అవకాశం
ఇవ్వాలని సోనియాను అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలు,
డీఎల్ అసమ్మతి
గురించి కూడా
ప్రస్తావించినట్లు తెలిసింది.
సోనియా
రాజకీయ సలహాదారు
అహ్మద్ పటేల్
తో కూడా
ఆయన సమావేశమయ్యారు.
అయితే వివేకా
మాత్రం వ్యక్తిగత
పనుల మీద
తాను ఢిల్లీ
వచ్చానని,
మర్యాదపూర్వకంగా మాత్రమే
పార్టీ నేతలను
కలిశానని ఆయన చెప్పారు.
త్రివిక్రమ్ సినిమాలో నరేష్...
రచయిత,
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి
పని చేయడానికి కామెడీ
హీరో అల్లరి నరేష్ ఓకే
చెప్పాడు. అల్లరి నరేష్
హీరోగా చిరునవ్వుతో ఫేం
రామ్ ప్రసాద్ దర్శకత్వంలో ఓ
సినిమా రూపొందబోతోంది. ఈ
చిత్రానికి త్రివిక్రమ్ స్టోరీ
సమకూర్చడంతో పాటు డైలాగ్స్, స్క్రిప్టు ఇవ్వడానికి ఒప్పుకునట్లు తెలుస్తోంది.
గతంలో రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన
‘చిరునవ్వుతో’ చిత్రానికి త్రివిక్రమ్ కథ,
డైలాగులు, స్ర్కిప్టు అందించారు. ఆ
చిత్రం అప్పట్లో భారీ
విజయం సాధించింది. తాజాగా
ఈ ఇద్దరి కాంబినేషన్లో నటించే
అవకాశం దక్కించుకున్నాడు అల్లరి
నరేష్. త్వరలోనే ఈ
చిత్రానికి సంబంధించిన పూర్తి
వివరాలు వెల్లడికానున్నాయి.
ప్రస్తుతం అల్లరి నరేష్
ఇ.సత్తి దర్శకత్వంలో చంటి
అడ్డాల నిర్మించబోయే సోసియో
ఫాంటసీ చిత్రంలో నటించడానికి రెడీ
అవుతున్నాయి. ఈ సినిమా
వివరాలను నిర్మాత చంటి
అడ్డాల వెల్లడిస్తూ -‘‘కొంత
విరామం తర్వాత మా
సంస్థ నుంచి వస్తున్న సినిమా
ఇది. నరేష్ కెరీర్లోనే ఇది
హై బడ్జెట్ చిత్రం
అవుతుంది. సాంకేతికంగా అద్భుతం అనిపించేలా ఉంటుంది. పూర్తి
వినోదభరితంగా సత్తిబాబు ఈ
చిత్రం రూపొందించనున్నారు.
-----------------------------------------------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి