సిలిండర్ పేలి ఏడుగురు
మృతి
రంగారెడ్డి జిల్లా
మేడ్చల్ మండలం
గండ్లపోచంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగి ఏడుగురు దిర్మరణం చెందారు. మరణించినవారిలో
నలుగురు చిన్నారులు,
ఓ మహిళ
ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
దాదాపు
50
మంది గాయపడినట్లు
తెలుస్తోంది.
దాదాపు 100
గుడిసెలు దగ్ధమయ్యాయి.
గ్యాస్ సిలిండర్
పేలడంతో అగ్ని
ప్రమాదం జరిగింది. ఓ గుడిసెలోని సిలిండర్ పేలడంతో
ప్రారంభమైన మంటలు ఇతర గుడిసెలకు వ్యాపించాయి.
సంఘటనా స్థలానికి
ఫైర్ ఇంజన్లు
చేరుకుని మంటలను అదుపు చేశాయి.
గాయపడినవారిని
ఆస్పత్రులకు తరలించారు.
మృతుల సంఖ్యపై ఇంకా
నిర్ధారణ కావాల్సి ఉంది.
అక్కడి వారంతా కూలీ చేసుకునేవారే. బాధితులు మహబూబ్నగర్,
మెదక్ జిల్లాలకు
చెందిన కూలీలు
అని తెలుస్తోంది.
వెంటనే సహాయక
చర్యలు చేపట్టాలని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా
కలెక్టర్ను ఆదేశించారు.
హోం మంత్రి
సబితా ఇంద్రా
రెడ్డి సంఘటనా
స్థలానికి చేరుకున్నారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కాంగ్రెస్ అభ్యర్థుల ఖారారు: అరుణ-పొన్నాల
మహబూబ్ నగర్ జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్న మూడు స్థానాలకు అభ్యర్దుల ఎంపిక దాదాపు ఖరారైంది. ఈ జిల్లా మంత్రిగా ఉన్న డీకే.అరుణ, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలతో సమావేశమై చర్చించారు. అనతరం వారు మీడియాతో మాట్లాడుతూ పాలమూరు అసెంబ్లీ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మిని బరిలోకి దించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. అలాగే, కొల్లాపూర్ స్థానం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూల్ స్థానం నుంచి దామోదర్ రెడ్డిలు పోటీ చేస్తారని తెలిపారు. కొల్లాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతుండగా, నాగర్కర్నూల్ స్థానం నుంచి టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈయనకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఛార్జీలు పెంచితే రాష్ట్రం అగ్నిగుండమే : రాఘవులు
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలను పెంచితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు హెచ్చరించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు సతమతమవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిపై అదనంగా విద్యుత్ ఛార్జీల భారం మోపితే చూస్తూ ఊరుకోబోమని ప్రకటించారు. అందువల్ల కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తక్షణం ఉప సంహరించుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో రాఘవులు పాల్గొన్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలపై ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణ శనివారం గందరగోళానికి దారితీసింది. ఈ యేడాది 5,000 కోట్ల రూపాయలను పెంచేందుకు అనుమతించాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కమిషన్‑ను కోరాయి.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
గెల్వకుంటే పరువు పోతది.. నేతలతో
కేసీఆర్
ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించి తీరాలని పార్టీ నేతలతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయాన్ని సొంతం చేసుకుంటే తెలంగాణలో భవిష్యత్ మనదేనంటూ ఆయన భరోసా ఇచ్చారు. ఉప ఎన్నికల అంశంపై చర్చించేందుకు ఆయన శనివారం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం ఎన్నికల కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యక్షులుగా నాయిని నర్సిహా రెడ్డి, సభ్యులుగా ఈటెల రాజెందర్, విజయరామారావు, మహమ్మద్ అలీ, జగదీశ్ రెడ్డిలను ఆయన నియమించారు.
ఆరు స్థానాలకు గాను ఒక్క సీటు కోల్పోయినా పరిస్థితి తారుమారవుతుందని ఆయన హెచ్చరించారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కోవూరులో `ప్రసన్న' గెలుపు ఖాయమా..?
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నిక ఖాయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎన్.ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు. ప్రస్తుత అంచనాలు, సర్వేల ప్రకారమైతే నల్లపురెడ్డి గెలుపు నల్లేరుపై నడకలాగే ఉంటుందని చెపుతున్నారు. వాస్తవంగా చూస్తే... ఈ దఫా ఆయన గెలుపు కష్టం కాకపోయినా మెజారిటీ తగ్గే ప్రభావం ఉంది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి 73,212 ఓట్లు పోలయ్యాయి. అలాగే, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శ్రీనివాసుల రెడ్డికి 65,768 ఓట్లు రాగా, ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలోకి దిగిన తుపాకుల మునెమ్మ (ఎస్టీ)కు 22,624 ఓట్లు లభించాయి. ఈ దఫా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్-కాంగ్రెస్-టీడీపీల మధ్యే కొనసాగనుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక్కడ అధ్వాన్నంగా ఉంది. ఈ సారి ప్రసన్న వ్యక్తిగత ఇమేజ్తో కంటే వైఎస్ఆర్ సానుభూతి, జగన్మోహన్ రెడ్డి హవాల మధ్య విజయకేతనం ఎగురవేసే అవకాశాలు ఉన్నట్టు స్థానిక వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మాత్రం డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమంటున్నారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కెసిఆర్ టార్గెట్గా కిరణ్ - బాబు
కసరత్తు
తియారేస్ అధ్యక్షుడు కె.
చంద్రశేఖర రావును లక్ష్యంగా ఉప ఎన్నికల పోరుకు
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు
నాయుడు,
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్
రెడ్డి కసరత్తు
చేస్తున్నారు.
కాంగ్రెసు,
తెలుగుదేశం పార్టీల అభ్యర్థుల
ఎంపిక దాదాపు
ఖరారైనట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికలు జరుగుతున్న
ఆదిలాబాద్,
స్టేషన్ ఘనపూర్,
కామారెడ్డి,
కొల్లాపూర్
నియోజకవర్గాలకు తెరాస అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు.
తెలుగుదేశం,
కాంగ్రెసు పార్టీలకు రాజీనామాలు చేసి
తెరాసలో చేరినవారే
ఇప్పుడు పోటీ
చేస్తున్నారు.
నాగర్ కర్నూలులో తెలంగాణ నగారా
సమితి నేత
నాగం జనార్దన్
రెడ్డికి తెరాస మద్దతిచ్చే అవకాశం ఉంది.
మహబూబ్నగర్లో ఇబ్రహీంను
పోటీకి దించే
ఆలోచనలో తెరాస
ఉన్నట్లు తెలుస్తోంది.
తెరాస అభ్యర్థులను
దీటుగా ఎదుర్కునే వారి కోసం కాంగ్రెసు,
తెలుగుదేశం పార్టీ
కసరత్తు చేస్తున్నాయి.
స్టేషన్ ఘనపూర్
నుంచి తెలుగుదేశం
పార్టీ తరఫున
మాజీ మంత్రి
కడియం శ్రీహరి, మహబూబ్నగర్ మాజీ
మంత్రి చంద్రశేఖర్, నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డిని ఆదిలాబాద్ నుంచి పాయం
శంకర్ను పోటీకి
దించే ఆలోచనలో
చంద్రబాబు ఉన్నారు.
కాగా,
కాంగ్రెసు
పార్టీ కూడా
బలమైన అభ్యర్థుల
కోసమే కసరత్తు
చేస్తోంది.
శుక్రవారంనాడు ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్
రెడ్డి,
పిసిసి
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మహబూబ్ నగర్
జిల్లా నాయకులతో
సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
తెలంగాణలోని ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల
మనోభావాలను గౌరవించి తాము పోటీకి దిగబోమని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్
జగన్ ఇదివరకే
ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీకి ఉప ఎన్నికల్లో
డిపాజిట్లు కూడా రావని తెరాస నాయకులు
అంటున్నారు.
ఈ స్థితిలో ఒకటి రెండు
సీట్లైనా గెలిచి తెరాసకు చెక్ పెట్టాలని
తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెసు కూడా
ఆలోచన చేస్తున్నాయి.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఇప్పుడా కమెడియన్.. 3 కోట్ల హీరో!
సాధారణ కమెడియన్గా
పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్రస్తుతంటాప్
హీరో..! తాజాగా తన కామెడీ
పర్సనాలిటీని కండలు తిరిగిన హీరో ఇమేజ్ కు తగ్గట్టు మలుచుకోవడం లేటెస్ట్ ట్విస్ట్.
సునీల్ స్టార్
కమెడియన్గా రాణిస్తున్న
కాలంలో సినిమాకు
రూ. 15
లక్షల
వరకు రెమ్యూనరేషన్
తీసుకునే వాడని,
అందాల రాముడు,
మర్యాద
రామన్న సినిమాల
ద్వారా హీరోగా
టర్న్ అయ్యాక
‘
పూల రంగడు’
చిత్రానికి రూ. 3
కోట్ల వరకు రెమ్యూనరేషన్
తీసకున్నాడని సినీ వర్గాల టాక్.
తాజాగా విడుదలైన
సునీల్ పూల
రంగడు....
రవితేజ ‘
నిప్పు’
సినిమాను సైతం
వెనక్కి తోసి
హిట్ టాక్
సొంతం చేసుకున్న
నేపథ్యంలో సునీల్ కెరీర్కు
ఇక తిరుగుండదనే
అంచనాలు మొదలయ్యాయి.
ఈ సినిమా
మంచి వసూళ్లు
సాధిస్తే సునీల్ రెమ్యూనరేషన్ మరింత పెరిగినా
ఆశ్చర్యపడనక్కర్లేదని సినిమా ట్రేడ్
వర్గాలంటున్నాయి.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి