11, ఫిబ్రవరి 2012, శనివారం

 చిరుకు ఉప నేత పదవి 
చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా ప్రకటించనున్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం  విలీన ప్రక్రియను పూర్తి చేసి, చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా నియమిస్తారని తెలుస్తోంది. శానససభలో ప్రజారాజ్యం పార్టీ ఇంకా సాంకేతికంగా కాంగ్రెసు పార్టీలో విలీనం కాలేదు. విలీన ప్రక్రియ పూర్తయితే చిరంజీవి శానససభలో వెనక సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానివల్ల గత శానససభా సమావేశాల సందర్భంగా విలీనానికి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదం తెలుపలేదని అంటున్నారు. నెల 13 తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీనికి ముందే చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా ప్రకటించే ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.
 డిఎల్  వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్...?
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్గా పరిగణిస్తోంది. ఢిల్లీకి సూట్కేసులు మోసి పదవులు తెచ్చుకుంటున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేశాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తిరుగుబాటు చేయడం కన్నా వ్యాఖ్యల మీదనే అధిష్టానం ఎక్కువగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. డిఎల్ రవీంద్రా రెడ్డిని వివరణ కోరబోమని రాష్ట్రానికి చెందిన ఎఎసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చెప్పినప్పటికీ విషయాన్ని వదిలేస్తే నష్టం జరుగుతుందని అధిష్టాన0 అనుకుంతొ౦ది. డిఎల్కు  అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారుడిఎల్ వ్యాఖ్యలకు సంబంధించిన సిడిలను, వార్తాపత్రికల క్లిప్పింగులను కొంత మంది పార్టీ నాయకులు అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోందితిరుపతిలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కడప జిల్లా పార్టీ నాయకుల సమావేశానికి తాను రాబోనని చెబుతూ ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పైగా, కడపకు రావడానికి ముఖ్యమంత్రి భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
 కెమెరామెన్ గంగతో... రాంబాబు
వన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకుకెమెరామెన్ గంగతో రాంబాబుఅనే టైటిల్  ఖరారు చేశారు .టైటిల్లో రెండు పేర్లు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఒకటి కెమెరామెన్ గంగ, మరొకరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయన ఏపాత్ర పోషిస్తున్నారు? కెమెరామెన్ గంగ పాత్రా? లేక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు పాత్రా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

శ్యామల వీరంగం

శ్యామల మీకు గుర్తుండే ఉంటుంది. దేవదాసిగా మారిన శ్యామల అనేకసార్లు బుల్లితెర ముందుకు వచ్చి పెద్ద తెరపై కనిపించాలన్న తన అభిలాషను వెల్లడించిన విషయం మనకు తెలుసు. జోగిని వ్యవస్థను రూపుమాపడానికి తాను కృషి చేస్తున్నట్టు ఆమె పలుసందర్భాల్లో తెలిపింది. ఆమె కోరిక నెరవేరబోతోంది. `వీర౦గం' పేరుతో రాష్ట్రంలో విడుదల కానున్న ఈ సినిమాలో శ్యామల ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆమె సరసన మరో ముఖ్య పాత్రలో సుమన్ కనిపించనున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి