15, ఫిబ్రవరి 2012, బుధవారం


రాజ్యసభకు విజయమ్మ : పులివెందులలో వివేకానంద?
రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మీని బరిలోకి దింపే యోచనలో ఉంది. ఆమెను రంగంలోకి దింపడం ద్వారా కాంగ్రెస్పార్టీని పూర్తి స్థాయిలో ఇరుకునపెట్టేందుకు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈనెలాఖరుకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్వెలువడనుంది. వచ్చే నెల మూడవ వారంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 17 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి పేరును పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తే సరిపోతుంది. కానీ, జగన్ వర్గానికి 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారురాజ్యసభ అభ్యర్థి విషయంలో  వైఎస్‌.విజయలక్ష్మీ, వివేకానంద రెడ్డి పేర్లు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  అయితే, వివేకా కంటే.. వైఎస్.విజయలక్ష్మినే పార్టీ తరపున అభ్యర్థిగా బరిలోకి దించితే వైఎస్పట్ల ఉన్న సానుభూతి ఆమెకు దోహదపడుతుందన్నది వారి అభిప్రాయం. విజయలక్ష్మి అభ్యర్థిగా ఎమ్మెల్యేలను ఓట్లు అభ్యర్థిస్తే వైఎస్తో ప్రత్యక్ష అనుబంధం ఉన్న ఎమ్మెల్యేలు నైతిక సంకటంలో పడటంఖాయమంటున్నారు. దీంతోపాటు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని విజయలక్ష్మి పిలుపునిస్తే కాంగ్రెస్పార్టీ పూర్తి ఆత్మరక్షణలో పడటం ఖాయమని జగన్ వర్గ నేతలు భావిస్తున్నారు. విజయమ్మ రాజ్యసభ బరిలో విజయం సాధిస్తే 14 రోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అపుడు ఖాలీ అయిన వైఎస్.వివేకానంద రెడ్డినే బరిలోకి దింపాలన్నది వారి వ్యూహం. నిజానికి పులివెందులలో వైఎస్ఆర్ జీవించివున్నప్పటి నుంచి వివేకాకు మంచి, పరిచయాలన్నీ ఉన్నాయి. ఇవి పార్టీకి దోహదపడతాయని భావిస్తున్నారు. తనను  కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని వివేకానంద రెడ్డిని గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ముఖ్యంగా.. పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారైంది. దీంతో తన చిన్నాన్నను ఆదుకోవాలన్న సంకల్పంతో కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే తరహా ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

తెలంగాణ కోసం కెసిఆర్ హోమం

తెలంగాణ రాష్ట్ర సాధనకు టియారెస్ అధినేత కెసియార్ మరోసారి హోమం చేయనున్నారు నెల 16, 17 తేదీల్లో టిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవనంలో హోమం చేస్తారు. కెసిఆర్ దంపతులు  హోమంలో పాల్గొంటారు. హోమం కోసం ఏర్పాట్లు పూర్తయినాయని తెలుస్తోందిపదిహేడో తారీఖున కెసిఆర్ పుట్టిన రోజుకాస్తంత సమయం దొరికితే మెదక్ జిల్లాలోని జగదేవ్పూర్ మండలం వెంకటాపురంలోని తన ఫామ్ హౌస్కు వెళ్లొస్తున్న కెసిఆర్ మరోసారి అక్కడకు వెళ్లారు. ఈసారి ఆయన సతీసమేతంగా వెళ్లడం విశేషం. సోమవారం సాయంత్రం వెంకటాపురానికి చేరుకున్న కెసిఆర్ అక్కడే ఉన్నారు.
 xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

ఆ ఇద్దరికీ బొత్స టార్గెట్: అంబటి

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ మేరకు ఎసిబి నివేదికలు బయట పెడతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అంటే పరోక్షంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అన్నారు. వారిద్దరి మ్యాచ్ ఫిక్సింగ్  విషయం బొత్స వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయన్నారు. బాబు, కిరణ్ ఇద్దరి టార్గెట్ బొత్సనే అని అన్నారుసిఎంను మచ్చిక చేసుకునేందుకు బొత్స చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్కులు ప్లే చేయడం సరికాదన్నారుప్రభుత్వం భూకేటాయింపులపై మరోసారి సభా సంఘం వేస్తే చంద్రబాబు హయాం నుండి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
                                                               xxxxxxxxxxxxxxxxxxxxxx
  మోసపోయిన "జర్నీ" భామ
Ananya
FILE
 "జర్నీ" హీరోయిన్ అనన్యకి కాబోయే భర్త వెయ్యి వాట్స్ షాక్ ఇచ్చాడు. ఈ ముద్దుగుమ్మకు గతవారం పారిశ్రామికవేత్త ఆంజనేయన్‌తో నిశ్చితార్థమైంది.  సంప్రదాయ కట్టుబాట్లు కలిగిన అనన్యకు వారి పెద్దలు చూసిన వ్యక్తే ఈ ఆంజనేయన్. నిశ్చితార్థం అయిన తర్వాతనే ఆంజనేయన్‌కి ఇదివరకే పెళ్లి అయ్యినట్లు అనన్య కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలియవచ్చింది. అంటే.. తమ కుమార్తెను రెండో భార్యగా అత్తారింటింకి పంపుతున్నామా అనే ఆశ్చర్యంతో పాటు వారు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకున్న అనన్య కుటుంబసభ్యులు వరుడు ఇంటివారు చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆంజనేయులు ముందే పెళ్లి అయినట్లు, వివాహ రద్దు కోసం కోర్టును ఆశ్రయించినట్టు కనుగొన్నారు. తన తొలి చిత్రంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనన్యకు కూడా సాధారణ యువతుల్లానే మోసపోవడం గమనార్హం.
                                                                xxxxxxxxxxxxxxxxxxxxxxxxx

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి