20, ఫిబ్రవరి 2012, సోమవారం



భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిట 
హా శివరాత్రి. రాష్టవ్య్రాప్తంగా శైవక్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల కోలాహలం మిన్నంటింది. సోమవారం మల్లికార్జునుడు, భ్రమరాంబ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం రాత్రినుంచే భక్తులు తరలివచ్చారు శివరాత్రి పర్వదినం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి. శివుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఉదయం స్వామి వారికి వేదమంత్రాల మధ్య పాలాభిషేకం చేశారు. సుమారు 50వేల మంది భక్తుల వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశముంది. ఈ ఉత్సవాలు ఐదురోజుల పాటు జరుగుతాయి. శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు తరలి వచ్చారు.  రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు అన్ని శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, రుద్రాభిషేకాలు, రాత్రి 12 గంటలకు భ్రమరాంభికా సమేత మల్లికార్డున స్వామి కళ్యాణోత్సవం. వేములవాడలో సాయంత్రం ఆరుగంటలకు సహస్ర లింగార్చన. గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయంలో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్‌ దేవాలయం కిటకిటలాడుతోంది. శ్రీకాళహస్తిలో ముక్కంటిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మెదక్ జిల్లా ఏడుపాయలు జాతరకు ముస్తాబైంది.
కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వాయిదా
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అసెంబ్లీ స్ధానానికి జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక నెల 21కి వాయిదా పడింది. కామారెడ్డి నియోజకవర్గం కార్యకర్తలతో తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. జిల్లా మంత్రి సుదర్శన్రెడ్డి, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. కామారెడ్డి షబ్బీర్ సొంత నియోజకవర్గం. కామారెడ్డి టిక్కెట్టును షబ్బీర్కే ఇవ్వాలని, కాదంటే ఇక్కడి నుంచి కదలబోమని కార్యకర్తలు ముఖ్యమంత్రికి చెప్పారు. అయితే కామారెడ్డి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు షబ్బీర్ అంత సుముఖంగా లేరని తెలిసింది. అధిష్ఠానం చెబితే మాత్రం పోటీకి దిగక తప్పదని షబ్బీర్ భావిస్తున్నారు. ఒకవేళ షబ్బీర్ కాదంటే జిల్లా సెంట్రల్ బ్యాంకు మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కైలాస్సింగ్నాథ్, మాచారెడ్డి ఎంపిపి మాజీ అధ్యక్షుడు నర్సింగరావు, కేన్ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్రెడ్డి పేర్లను పరిశీలనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. అభ్యర్థి ఎవరన్నది నెల 21 తుది నిర్ణయం తీసుకోనున్నారు.
 కాంగ్రెస్, టీడీపీలకు అభ్యర్థులు కరువు
రాష్ట్రంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారాయి. మార్చి 18 జరగబోయే ఎన్నికల్లో గెలుపు సంగతెలా ఉన్నా... కనీసం పరువు దక్కించుకునేందుకు రెండు ప్రధానపార్టీలు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, టీడీపీలకు కొన్నిచోట్ల సరైన అభ్యర్థులే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ అవకాశవాద వైఖరి మూలంగా తెలంగాణలో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహబూబ్నగర్, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతుండగా, కాంగ్రెస్ పెద్దలు ఏడు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి పరువు నిలుపుకోవాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ఆయా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడమేగాకుండా ప్రచారంలోనూ ముందడుగేసింది. ఇక నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి  ప్రసన్న కుమార్రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోవూరులో వైఎస్సార్సీపీ ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చి రెండు నుంచి రెండు విడతలుగా నియోజకవర్గంలో ప్రచారంచేస్తారు. కోవూరునుంచి సీపీఎం రంగంలోకి దిగడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్దేనని మంత్రులు పైకి చెబుతున్నా... అంతర్గతంగా మాత్రం ఓటమి ఖాయమని అంగీకరిస్తున్నారుఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ప్రచారానికి వెళ్లేందుకు సుముఖంగా లే రని అమాత్యులు చెబుతున్నారంటే కాంగ్రెస్ పరిస్థితి విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉప ఎన్నికలు జరిగే ఏడు స్థానాల్లో రెండు (కొల్లాపూర్, స్టేషన్ఘన్పూర్) కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కాగా నాలుగు (ఆదిలాబాద్, నాగర్కర్నూలు, కామారెడ్డి, కోవూరు) టీడీపీ సిట్టింగ్ స్థానాలు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే దివంగత రాజేశ్వర్రెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచినప్పటికీ తరువాత ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగానే కొనసాగారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఆయా స్థానాల్లో ఎన్నికలు అధికార, విపక్ష పార్టీలకు పెద్ద పరీక్షగా మారాయి. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే....
తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలకుగాను ఐదింటికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్- జోగు రామన్న, కామారెడ్డి- గంపా గోవర్ధన్, కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు, స్టేషన్ఘన్పూర్- డాక్టర్ టి. రాజయ్య, మహబూబ్నగర్ - సయ్యద్ ఇబ్రహీం పోటీ చేస్తారని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నాయిని నర్సింహారెడ్డి ఆదివారం ప్రకటించారు. నాగర్కర్నూలు నియోజకవర్గంలో మాత్రం తెలంగాణ కోసం రాజీనామా చేసిన నాగం జనార్దన్రెడ్డికే టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలిపారు.
జేఏసీనుంచి బీజేపీ ఔట్!
మహబూబ్నగర్ సీటు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జేఏసీ వైఖరికి నిరసనగా జేఏసీ నుంచి తప్పుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమకు పట్టున్న మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని తమకు వదిలేయాలని బీజేపీ పట్టుబడుతోంది. అయితే ఉద్యమమే తప్ప సీట్లబేరం తమవల్ల కాదని జేఏసీ కన్వీనర్ కోదండరాం, తదితర నేతలు స్పష్టంచేశారు. విషయమై టీఆర్ఎస్తో జరిపిన మంతనాలు కూడా ఫలించలేదు. దీంతో తమ అస్థిత్వాన్ని కేసీఆర్ గుర్తించనప్పుడు ఆయన పార్టీ ఉన్న జేఏసీలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

 బరిలో బిజెపి- `దేశం'లో ఆశలు

ప ఎన్నికలలో తాము కూడా పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించడంతో తెలుగు దేశం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోందనే చెప్పవచ్చు. బిజెపి నేత లక్ష్మణ్ ఆదివారం తాము మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తాము బరిలోకి దిగుతామని, రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లోని మరో మూడు నియోజకవర్గాల్లో కూడా తాము పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. బిజెపి నేతల నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సమితిని షాక్‌కు గురి చేసేది కాగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. బిజెపి మహబూబ్ నగర్‌తో పాటు మరో రెండు మూడు నియోజకవర్గాల్లో పోటీకి దిగితే తెలంగాణవాదులు ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్ నగర్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఏ మూడు నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను నిలిపినా సీటు గెలుపొందవచ్చుననే ఆశ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది.
 మాజీ ఎంపీ మధుపై దాడి
సిపిఎం నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మధుపై సోమవారం మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఎంపి మధుపై దాడి యాకుత్‌పురా శాసనసభ్యుడు ముంతాజ్ ఖాన్, స్థానిక కార్పోరేటర్ వజీద్ అలీ సమక్షంలోనే జరిగింది. ఉదయం పాతబస్తీలో ఓ కార్యకర్తను పరామర్శించేందుకు మధు అక్కడకు వెళ్లారు. మధును మజ్లిస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. మజ్లిస్ కార్యకర్తలు మధుపై దాడి చేశారు. మధుపై దాడి నేపథ్యంలో ఘటనా ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. మధుపై మజ్లిస్ కార్యకర్తల దాడిని సిపిఎం కార్యకర్తలు ఖండించారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని భవానీ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట కార్యకర్తలు బైఠాయించారు. దాడిలో గాయపడ్డ మధు కూడా పిఎస్ ముందు బైఠాయించారు. 

మళ్లీ తృతీయ ఫ్రంట్ యత్నాలు

జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం మరణశయ్యపై ఉందని, వెంటలేటర్‌పై కొన ఊపిరితో కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యువకిరణాలు పేరుతో హోటళ్లలో పని చేయిస్తున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లలో 20 మంది మంత్రులు, వంద మంది శాససభ్యులు ఉన్నారని, అందుకే మద్యం సిండికేట్లపై ఎసిబి నివేదికను ముఖ్యమంత్రి బయట పెట్టడం లేదని ఆయన అన్నారు.
xxxxxxxxxxxxxxxxx

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి