మధ్య తరగతి కుటుంబ కధే... 'ధోని'
ప్రకాష్రాజ్ దర్శకనిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం
'ధోని'. చిత్ర గేయాలు ఈ రోజు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఓ
కార్యక్రమంలో సీతారామశాస్త్రి, ఇళయరాజా సంయుక్తంగా విడుదల
చేశారు. ప్రకాష్రాజ్
మాట్లాడుతూ...'సినిమా కథ
సిద్ధం చేశాక త్రివిక్రమ్కు
చెప్పాను. చిన్న చిన్న
మార్పులు చేశారు. సందేశాత్మక చిత్రంగా తీయాలనుకున్నాం. కథకు
తగినట్లుగా సీతారామశాస్త్రి సాహిత్యం, ఇళయరాజా సంగీతం
సమకూరడం అదృష్టంగా భావిస్తున్నా. చదువు
నేపథ్యంలోసాగే
మధ్యతరగతి కుటుంబ కథే
ఈ చిత్రమిది' అని
తెలిపారు. సీతారామశాస్త్రి
మాట్లాడుతూ...'విలక్షణమైన నటుడు
ప్రకాష్రాజ్. మంచి
కథను ఎంచుకుని సందేశాత్మకంగా చిత్రాన్ని మలిచారు. నాపై
ఉన్న నమ్మకంతో నా
చేత పాటలు రాయించాడు. ఇళయరాజా సంగీతం
చక్కగా కుదిరింది' అని
అన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ...'చిత్ర
కథాంశం తెలుగు పరిశ్రమ గర్వించేలా ఉంటుంది. నాపై
అభిమానంతో సంగీతం సమకూర్చేలా చేశాడు.
మంచి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని
అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ...'ప్రపంచంలో రీరికార్డింగ్ను
పాడుకునేట్లుగా
సంగీతం చేయగల సత్తా
ఇళయరాజాకే ఉంది. ప్రకాష్రాజ్
కథ చెప్పారు. కానీ
పెద్దగా మార్పులు చేయలేదు. సినిమా
అద్భుతంగా వచ్చింది. తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకముందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరొయిన్ ప్రత్యెక ఆకర్షణగా నిలిచారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి