జైలులో కళ్లు తిరిగి పడిపోయిన బిపి ఆచార్య
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో
అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి
ఆచార్య గురువారంనాడు హైదరాబాదులోని చంచల్గుడా జైలులో
అస్వస్థతకు గురయ్యారు. కళ్లు
తిరిగి ఆయన కింద
పడిపోయారు. దీంతో జైలులో
వైద్యుల చేత చికిత్స అందించారు. అయితే,
ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆచార్యకు గుండెపోటు వచ్చే
ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆచార్యకు సిబిఐ
కోర్టు ఈ నెల
15వ తేదీ వరకు
జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో
ఆయనను కోర్టులో హాజరు
పరిచిన తర్వాత చంచల్గుడా జైలుకు
తరలించారు.జైలుకు వచ్చిన తర్వాత
ఆచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అరెస్టు చేసిన
తర్వాత బిపి ఆచార్యను కోర్టు
రెండు రోజుల పాటు
సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఆ
సమయంలో సిబిఐ అధికారులు ఆయనకు
బేగంపేటలోని ఆస్పత్రిలో చికిత్స అందించి దిల్కుషా అతిథిగృహానికి తరలించారు. ఆ
తర్వాత అకస్మాత్తుగా ఆయనకు
గుండె నొప్పి వచ్చింది. దీంతో
ఆయనను సిబిఐ అధికారులు నిమ్స్కు తరలించారు. నిమ్స్లో చికిత్స, వైద్య
పరీక్షల అనంతరం గురువారం ఉదయం
ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. బిపి
ఆచార్య ఆరోగ్యం బాగాలేదని, వైద్యులు పరీక్షిస్తున్నారని జైలు
ఉన్నతాధికారి కేశవ నాయుడు
చెప్పారు.
2జీ కేసు...
చిదంబరంపై ప్రధాని చర్యలు
తీసుకోవాలి: భాజపా
2జీ స్కామ్లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం పాత్రపై విచారణ జరిపించాలా వద్దా అనే విషయం ట్రయల్ కోర్టే నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు సూచించిన కొద్దిసేపటికే
ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్పై దాడికి దిగింది. దీనిపై బిజేపి నాయకుడు రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిదంబరంపై ప్రధాని తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 2జీ స్కామ్ విషయంలో బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి పి.చిదంబరం తన మంత్రి పదవికి రాజీనామ చేయాలని అన్నారు. కేంద్రంలో ఉన్న యుపిఎ కూటమిలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి ప్రభుత్వంగా మారిందని తెలిపారు. ఎ.రాజా హయాంలో తీసుకున్న నిర్ణయాలను డా.మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో సమర్థించారని తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్న యుపిఎ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, తమ అవినీతి గురించి కూడా ప్రజలకు చెపితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కేంద్ర మాజీ టెలికామ్ మంత్రి ఏ.రాజా హయాంలో 2008 తర్వాత కేటాయించిన 122 టెలికామ్ లైసెన్సులను నాలుగు నెలల పాటు రద్దు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సిపిఎం రాష్ట్ర్ర మహాసభలు ప్రారంభం
సీపీఎం మహాసభలకు ఖమ్మం
ముస్తాబు
* భారీ ఏర్పాట్లు చేసిన కామ్రేడ్స్ * మూడు రోజులపాటు రాష్ట్ర మహాసభలు
* రాష్ట్ర కార్యదర్శి ఎన్నికపై ఉత్కంఠ
మూడురోజుల పాటు ఖమ్మంలో జరగనున్న రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణతో పాటు 42 తీర్మానాలు చేయనున్నారు. మహాసభల్లో చివరి రోజున నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరి పోరాటం చేయడం వంటి నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది. సీపీఎం 23వ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం ముస్తాబైంది. ఎర్రజెండాల రెపరెపలతో కళకళలాడుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న సభలకు కామ్రెడ్స్ భారీ సన్నాహాలు చేశారు. పెవీలియన్ గ్రౌండ్స్లో జరగనున్న మహాసభలను సీపీఎం జాతీయ నేత ప్రకాష్ కారత్ ప్రారంభించనున్నారు. బృందా కారత్, సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు తదితరులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లోనే పార్టీ కొత్త రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక జరగనుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి రాఘవులునే నియమిస్తారనే వాదనతో పాటు వీరయ్యకు పార్టీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అటు ఈ మహాసభల కోసం సీపీఎం నేతలు భారీగా వసూళ్లు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహాసభల కోసం 26కోట్ల రూపాయలు వసూలు చేశారని వాటి లెక్కలను బహిరంగపరచాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను సీపీఎం నేతలు ఖండించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక సభలను సక్సెస్ చేసేందుకు సీపీఎం శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మెదటి రెండు రోజులు డెలిగేట్ మీటింగ్స్ జరగనుండగా, 4న భారీ ర్యాలీతో పాటు సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. మహాసభల సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లను ఎర్ర జెండాలతో అలంకరించారు. భారీ స్వాగత ముఖద్వారాలను ఏర్పాటు చేశారు.
బొత్స వద్దు కిరణే ముద్దు: రూటుమార్చిన చిరు?
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు క్రమంగా దూరమవుతూ, ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డికి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి కాంగ్రెసులో చేరినప్పటి నుండి
బొత్సతో సఖ్యతగా ఉంటూ,
కిరణ్కు దూరంగా
ఉంటున్నారన్న వాదనలు ఉన్న
విషయం తెలిసిందే. అయితే
ఇటీవల పరిణామాలు చూస్తుంటే చిరంజీవి క్రమంగా బొత్సకు దూరమవుతూ, సిఎంకు
దగ్గరవుతున్నారనే
చెప్పవచ్చు. కాపులలో బలం
ఉన్న చిరంజీవిని అడ్డుపెట్టుకొని, తన
బిసి కార్డుతో కాపు
స్నేహ బంధాన్ని మిళితం
చేసి ముఖ్యమంత్రి కావాలని దూకుడుగా వెళుతోన్న బొత్సకు చిరు
దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. బొత్స
నీడన ఉంటే తాను
ఏ పని చేసినా
ఆయన కారణంగానే చేస్తున్నాననే ప్రచారం జరుగుతోందని, ఇటీవల
ఆయనతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి సర్కారును కూల్చేసే ప్రయత్నాల్లో భాగస్వామి కూడా
అయ్యారన్న ప్రచారంపై చిరు
ఒకింత అసంతృప్తితో ఉన్నారట.అంతేకాకుండా కాకుండా బొత్సతో ఉంటే
ఒకే సామాజిక వర్గానికి చెందిన
నేతగా మిగిలిపోతాననే భావన
ఆయనలో కనిపిస్తోందని అంటున్నారు. ఇలా
అయితే తన రాజకీయ
జీవితానికే ప్రమాదమని చిరంజీవి భావిస్తున్నారని అంటున్నారు. మరోవైపు తన
వర్గం నేతలకు పార్టీలో సరైన
న్యాయం చేయాలంటే కిరణ్తో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆయన
భావించినట్లుగా
సమాచారం. బొత్సతో ఉన్నప్పుడు తన
వర్గానికి ఏమీ చేయలేక
పోయానని, మంత్రి పదవులు
అధిష్టానం హామీ మేరకే
వచ్చినప్పటికీ,
కిరణ్తో సఖ్యత
లేకపోవడం వల్ల తన
వర్గానికి చెందిన మంత్రులకు కోరిన
శాఖలు ఇప్పించుకోలేక పోయానని ఆయన
భావిస్తున్నారని
అంటున్నారు. ఆ తర్వాత
మాత్రం చిరంజీవి సమాచార
హక్కు చట్టం కమిషనర్ల జాబితాలో తాను
సిఫార్సు చేసిన వారి
పేర్లు చోటు చేసుకోవడం, మేడారం
జాతరకు ముఖ్యమంత్రితో కలిసి
వెళ్లడం వంటి సందర్భాలను గుర్తు
చేస్తున్న రాజకీయ పరిశీలకులు చిరంజీవి క్రమంగా సిఎంకు
దగ్గరవుతున్నారని
అంటున్నారు.మరోవైపు కిరణ్ కూడా తకు చిరంజీవి సహకారం అవసరమని భావిస్తున్నారని అంటున్నారు. చిరంజీవికి జనంలో ఉన్న గ్లామర్, పార్టీ నాయకత్వం ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యం, వీటికి మించి చిరు సమన్వయ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున ఆయనతో సఖ్యతగా ఉండటమే మంచిదని కిరణ్ యోచిస్తున్నారట. చిరుతో విభేదిస్తే సాధించేది ఏమీ ఉండదని, అందుకే ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. చిరంజీవి తన వైపు ఉంటే బొత్స ప్రాధాన్యత తగ్గుతుందని కూడా ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.
13 రాం చరణ్, ఉపాసన వివాహ తేదీ ఖరారు
* జూన్ 13న హైదరాబాద్లో పెళ్లి
* స్వయంగా ప్రకటించిన అపోలో ప్రతాపరెడ్డి
* మెగా ఫ్యాన్స్ లో ఆనందోత్సాహం
* వివాహానికి భారీ ఏర్పాట్లు
* తిరుపతిలో రిసెప్షన్ కు ప్లాన్
* అరగొండలో చేయాలని అపోలో వారి అభిలాష
మెగా ఫ్యామిలీలో వివాహానికి ముహూర్తం ఫిక్సయింది. చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన మెడలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మూడు ముళ్లు వేసే ఘడియ ఆసన్నమైంది. జూన్ 13న ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి రాజధానిలో వైభవోపేతంగా పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అటు వివాహానికి దీటుగా రిసెప్షన్ ను కూడా మెగా లెవల్లో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త . మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసనల వివాహ ముహూర్తం ఖరారైంది. ఈవార్తను స్వయంగా ఉపాసన తాతయ్య, అపోలో హాస్పటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తిరుమలలో ప్రకటించారు. కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. చెర్రీ, ఉపాసనల మ్యారేజ్ డేట్ ను ఎనౌన్స్ చేసారు. జూన్ 13న హైదరాబాద్లో వివాహాన్ని గ్రాండ్గా నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారని ప్రతాపరెడ్డి చెప్పారు. వివాహ ముహూర్తం గురించి తిరుమల అర్చకులతో కూడా ఆయన సంప్రదించారు. పెళ్లి డేటు ఫిక్సయినా.. ఇంకా వేదిక, సమయం వెల్లడికాలేదు. దీనిని చిరంజీవి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి కనీవినీ రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన ప్రతాపరెడ్డి.. రిసెప్షన్ ను కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా చేస్తామన్నారు. చిరంజీవి సొంత నియోజక వర్గం తిరుపతిలో రిసెప్షన్ నిర్వహించాలని చిరు భావిస్తున్నారని.. ఐతే.. తమ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా అరిగొండలో ఏర్పాటు చేయాలని చిరును కోరామని ఆయన చెప్పారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. గతేడాది డిసెంబర్ 1న కళ్లు చెదిరే సెట్టింగులు.. రంగు రంగుల పూలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య రాంచరణ్ తేజ్, ఉపాసన ఎంగేజ్మెంట్ కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులంతా తరలివచ్చి.. కొత్త జంటను ఆశీర్వదించారు. ఎంగేజ్ మెంటును తలదన్నేలా మెగా ఫ్యామిలీ ఇమేజ్ పెంచేలా.. వివాహ మహోత్సవాన్ని జరిపేందుకు అటు మెగా స్టార్, ఇటు అపోలో ఫ్యామిలీలు సన్నాహాలు చేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి