అందుకే వైఎస్ ఆ ఇద్దరినీ దూరంగా ఉంచారు...!
భావితరానికి
ఆచరణాశాలుగా మిగిల్చి వెళ్ళారు. ఎవరు అవునన్నా... కాదన్నా ప్రస్తుత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాటిని తూచా..తప్పకుండా పాటిస్తున్నారు.
వైఎస్ దారిలో నడవకపోతే తన మనుగడకే ముప్పు తప్పదని ఇప్పటి సిఎం కు బాగా
అర్ధమైనట్టు౦ది . శంకరరావు ఏమిటో... ఆయన నైజం ఏమిటో కిరణ్ కుమార్ కు
తెలిసొచ్చింది. అలాగే డిఎల్ రవీంద్రా రెడ్డి ఎంత ఘనుడో కళ్ళకు కట్టినట్లు
కనపడింది. వైఎస్ ఈ ఇద్దరినీ ఎందుకు దూరంగా ఉంచారో ఇప్పుడు కేవలం సిఎం కే
కాదు.. మొత్తం కాంగ్రెస్ వర్గాలకు బోధపడింది. వీళ్ళు పనిచేయరు.. సిఎంను తన
మానాన తాను పనిచేసుకు పోనివ్వరు. తమ పంతం నెగ్గకపోతే ఎంతకైనా తెగిస్తారని
ఇప్పుడు కాంగ్రెస్ అధిస్టానానికి కూడా విశదమైంది. కేవలం తమకు పదవులు
ఇవ్వలేదన్న కక్షతోనే వైఎస్ ను ఆడిపోసుకున్నారని ఇప్పుడు రాష్ట్రంలో ఏ
పసిపిల్లాడిని అడిగినా చెబుతాడు. వీలైన౦తవరకూ వైఎస్ అందరినీ కలుపుకు పోయే
ప్రయత్నం చేశారు. ఎంత మంచితన౦ ప్రదర్శించినా తన వెనక గోతులు తవ్వే
ప్రబుద్ధులను ఎవరుమాత్రం సహిస్తారు. వంకర బుద్దని తెలిసి తెలిసి ఎవరు
చేరదీస్తారు. వైఎస్ తమను దూరంగా ఉంచారనే కక్ష ఆయన చనిపోయినా ఈ ఇద్దరికీ
తీరలేదు. ఇప్పుడు తాజాగా కిరణ్ కుమార్ ఈ ఇద్దరు మిత్రులకు విరోధిగా మారాడు.
ఆయన పదవినుండి దిగిపోయే వరకూ అవిశ్రాంతంగా పోరాడడమే ఈ ఇద్దరు మిత్రుల తాజా
ఏకసూత్ర కార్యక్రమం. సందు దొరికితే చాలు సూటిపోటి వ్యాఖ్యలతో సిఎం వెంటాడి
వేధించి కసి తీర్చుకోవడమే ఇద్దరు మిత్రుల కాలక్షేపం. మంత్రివర్గం
సమిష్టిగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో సిఎంను ప్రతి నిముషం వేధిస్తుంటే
పాలన సాగేదేలా..? తమ నిర్ణయాలను కాదంటే జనం ముందు మంత్రి వర్గాన్ని చులకన
చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజశ౦. సహచర మంత్రులపై ఆరోపణలతో పత్రికలకేక్కడం ఏం
న్యాయమో వారి విజ్ఞతకే వదిలేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ మునిగిపోతున్న
నావగా మారినా వీరికి పట్టదు. తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప పార్టీ భావిష్యత్తు
ఏమైనా వీరికి అవసరం లేదు. పచ్చపార్టీ ఏలుబడిలో.. కాంగ్రెస్ నామరూపాలు
లేకుండా పోయిన పరిస్థితుల్లో.. పాదయాత్రతో కాంగ్రెస్ కు రాష్ట్రంలో
ప్రాణప్రతిష్ట చేసిన వైయెస్ చచ్చినా ఆ పార్టీలో కొందరికి కసి తీరలేదంటేనే
ఎంత దుర్మార్గమో.. తెలిసి పోతోంది. వైఎస్ నిర్ణయాల వెనక ఎంతో విలువైన విషయం
వుందని ఇప్పటికి అర్ధమైంది. 2014 ఎన్నికల్లో వైఎస్ పై దుమ్మెత్తి పోసిన
నాయకుల సత్తా ఏమిటో తెలిసిపోతుంది. తామేంటో... తమ బలమేంటో.. వారికీ తెలుసు.
ఇప్పుడు సిఎం కు.. కాంగ్రెస్ అధిస్టానానికి కూడా వీరి పోకడ అర్ధమైంది.
అసలు వచ్చే ఎన్నికల్లో వీరికి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుందో లేదో
అనుమానమే..! ఇచ్చినా గెలుపుపై పార్టీ ఆశవదులుకునే కఠిన నిర్ణయం
తీసుకుంటుందని భావించాలి. శంకరరావు ను ఇంకా మంత్రివర్గంలో కొనసాగిస్తే ఎంత
నష్టమో సహచర మంత్రులుసైతం అధిష్టానానికి విన్నవించారు. అలాగే డిఎల్
విషయంలోనూ ఇంటిలిజెన్సు నివేదికల సారాన్ని కాంగ్రెస్ అధిష్టానం
గ్రహించింది. ముఖ్యమంత్రికి స్వేచ్చ ఇస్తే తప్ప పాలన సక్రమంగా సాగదని
కాంగ్రెస్ అధిష్టానం తెలుసుకుంది. ఆమేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు
డిఎల్, శంకరరావు లు ఎంత అరిచి గీపెట్టినా... పార్టీ ప్రతిష్ట దెబ్బతినడమే
తప్ప ఒరిగేదేమీ ఉండదని అందరికీ తెలుసు. అయితే అంతిమంగా అందరికీ తెలిసొచ్చిన
నిజం ఏమిటంటే.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ ఇద్దరు నాయకులను
ఎందుకు దూరంగా ఉంచారానే అంశం...! కిరణ్ కుమార్ పాలన ఇలాగే కొనసాగితే
కాంగ్రెస్ కు నూకలు చేల్లినట్టేనని నిఘా నివేదికలు ఘోషిస్తున్నాయి.
చేష్టలుడిగిన కాంగ్రెస్ అధిష్టానం చెప్పుడు మాటలువిని జగన్ ను దూరం
చేసుకున్నామని ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటోంది. అయినా చేతులు కాలాక ఆకులు
పట్టుకున్నా ప్రయోజనం ఏముంటుంది.
-విఎస్సార్కే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి