జగన్పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి
గుంటూరు జిల్లాలో ఓదార్పులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుండగులు మంగళవారం సాయంత్రం కోడిగుడ్లు, రాళ్లతో దాడి
చేశారు. దాడి నుంచి
ఆయన తృటిలో తప్పించుకున్నారు. జిల్లాలోని నకిరికల్ మండలం
కుంకలగుంట గ్రామంలో ఈ
సంఘటన జరిగింది.. దీంతో గ్రామంలో తీవ్ర
ఉద్రిక్తత నెలకొంది. దాడి
చేసిన దుండగుల్లో ఒకతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు లేదా
నలుగురు ఈ దాడికి
పాల్పడినట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా తోపులాట, ఇరు వర్గాల
మధ్య కాస్తా ఘర్షణ
జరిగాయి . ఓ
వ్యక్తి గాయపడ్డాడు
చేజెర్ల సంఘటన నేపథ్యంలో కుంకలగుంటలో ఇరు
వర్గాల మధ్య ఘర్షణ
జరిగింది
సిబిఐ తదుపరి అరెస్టు ఎవరిది?
సిబిఐ
జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ
ఢిల్లీ పర్యటనపై రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలు
వినిపిస్తున్నాయి.
జెడి లక్ష్మీ నారాయణ
రెండు రోజుల క్రితం
ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీలో బిజీగా
ఉండగానే రాష్ట్రంలో తదుపరి
అరెస్టుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో
జెడి లక్ష్మీ నారాయణ
రెండు సార్లు ఢిల్లీ
పర్యటనకు వెళ్లి వచ్చిన
తర్వాతే అరెస్టులు జరిగాయి. దీనిని
కొందరు ఉదాహరణగా చూపిస్తూ త్వరలో
మరికొన్ని అరెస్టులు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జెడి లక్ష్మీ నారాయణ
మొదటిసారి ఢిల్లీ వెళ్లి
వచ్చాక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ
అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి ఆస్తుల
కేసులో సాక్షి వైస్
చైర్మన్ విజయ సాయి
రెడ్డి అరెస్టు జరిగింది. ఆ
తర్వాత రెండోసారి ఆయన
ఢిల్లీ వెళ్లి వచ్చాక,
ఎమ్మార్ కేసులో వరుస
అరెస్టులు జరిగాయి. తాజాగా ఆయన మరోసారి ఢిల్లీ
వెళ్లారు. గాలి గనుల
కేసు, జగన్ ఆస్తుల
కేసు, ఎమ్మార్ కేసులను దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ
ఇప్పటికే గాలి, ఎమ్మార్ కేసులలో ఛార్జీషీట్ను
కోర్టుకు సమర్పించింది. జగన్
ఆస్తుల కేసులో మాత్రమే ఛార్జీషీట్ సమర్పించవలసి ఉంది.
ఇటీవలి కాలంలో ఈ
కేసుల విచారణను వేగవంతం కూడా
చేసింది.
సెల్ ఫోనులో బూతు
బొమ్మలు చూసిన మంత్రి
కర్నాకట అసెంబ్లీలో ఆ రాష్ట్ర సహకార శాఖామంత్రి లక్ష్మణ్ తన మొబైల్ ఫోనులో బూతు బొమ్మలను చూడటమే కాకుండా తన ప్రక్కనే ఉన్న సహచర మంత్రిగారికి కూడా చూపిస్తూ కెమేరా కంటికి చిక్కారు. ఒకవైపు సభలో ప్రజా సమస్యలపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంటే, ఈయనగారు మాత్రం తాపీగా చేతిలో పెద్ద సైజు మొబైల్ ఫోను పట్టుకుని బూతు బొమ్మలను చూస్తూ సుమారు గంటన్నరపాటు గడిపారు. సంప్రదాయాలు, విలువలు గురించి చెప్పే భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రిగారు ఇటువంటి బూతు చిత్రాలను చూడటంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మరి బూతు చిత్రాల లోలుడు లక్ష్మణ్పై భాజపా ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి.
'పోల్'పై మహేష్ లేటెస్ట్ ట్వీట్
టైమ్స్ గ్రూప్
ఈ మధ్యన ఆన్
లైన్ లో నిర్వహించిన పోల్
లో మహేష్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈ
విషయమై తన అభిమానులుకు ఆయన
ధాంక్స్ చెపుతూ ట్వీట్
చేశారు. ఇండియాలో ఉన్న
హ్యాండ్సమ్ మ్యాన్ ల
లిస్ట్ తయారు చేయటం
కోసం. జనవరి 15 వరకూ
జరిగిన ఈ సర్వేలో 3.74 లక్షల
మంది పాల్గొని ఓట్
చేసారు.వారి రిజల్ట్ ని
షార్ట్ లిస్ట్ చేసి
ఓ యాభై మందిని
ప్రకటించారు. అందులో తెలుగు
నుంచి మహేష్ బాబు
పేరు ఉంది.
ఆ లిస్ట్ లో
..అమీర్ ఖాన్, అభయ్
డియోల్,అభిషేక్ బచ్చన్,అజిత్,ధనుష్,
సల్మాన్ ఖాన్,సూర్య,హృతిక్ రోషన్
వంటి హీరోలు,ఎమ్
ఎస్ ధోని, యువరాజ్ సింగ్
వంటి క్రికెటర్లు కూడా
చోటు చేసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి