ఏళ్లుగా వేధిస్తున్నారు: చంద్రబాబు
నాపై అన్యాయంగా
బురద జల్లాలని
చూస్తే వారికి
కోర్టు బుద్ధి
చెప్పిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా
చంద్రబాబు నాయుడు అన్నారు.
బాబు
ఆస్తులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ
అధ్యక్షురాలు
వైయస్ విజయమ్మ
వేసిన పిటిషన్ను
హైకోర్టు కొట్టివేసిన అంశం
పై
చంద్రబాబు స్పందించారు.
తనపై బురదజల్లి కడుక్కోమని
అంటున్నారని,
అయితే వారికి కోర్టు తీర్పు
బుద్ధి చెప్పిందన్నారు.
హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరవాలని బాబు
వైయస్సార్ కాంగ్రెసుకు సూచించారు.
ఎమ్మార్‌లో 2000
నుండి
విచారణ జరుపుతున్నట్టు
సిబిఐ చెప్పిన
తర్వాత కూడా
నాపై బురద
జల్లడం సరికాదన్నారు.
ఆర్టీఐ కమిషనర్ల
నియామకంపైనా ఆయన స్పందించారు.
స.
హ.
కమిషనర్ల విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ
అధ్యక్షుడు,
బొత్స సత్యనారాయణ,
ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి
తనపై దుష్ప్రచారం
చేస్తున్నారని బాబు అన్నారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సుప్రీం కోర్టులో
సవాల్ చేస్తా౦ - జగన్ పార్టీ
తెలుగుదేశం పార్టీ
అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై
వైయస్ విజయమ్మ
వేసిన పిటిషన్
డిస్మిస్ పైన ఆ పార్టీ నేతలు
గురువారం స్పందించారు.
ఈ తీర్పును తాము
ముందే ఊహించామని వైఎస్సార్
పార్టీ
అధికార ప్రతినిధి
వాసిరెడ్డి పద్మ అన్నారు.
తమకు రాష్ట్రంలో
ఎలాగు న్యాయం
జరగదని తెలిసే
గతంలోనే సుప్రీం
కోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీం కోర్టులో
సవాల్ చేస్తామని
ఆమె చెప్పారు.
ఒకే హైకోర్టులో
రెండు విభిన్న
తీర్పులు ఎలా వస్తాయని ఆమె ప్రశ్నించారు.
దీనిపై తాము
న్యాయ పోరాటం
చేస్తామని చెప్పారు.
మాజీ మంత్రి శంకర
రావు లేఖను
ఇదే హైకోర్టు
ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిందని,
మరి విజయమ్మ
పిటిషన్ ఎందుకు
స్వీకరించలేదని ప్రశ్నించారు.
సంతకం లేని శంకర
రావు పిటిషన్
స్వీకరించి,
రెండువేలపై చిలుకు ఆధారాలు చూపిస్తే
ఎందుకు కొట్టివేసిందన్నారు.
చంద్రబాబు నాట్ బిఫోర్ అడ్డు పెట్టుకొని
రాజకీయాలు చేస్తున్నారని మరో నేత కెకె
మహేందర్ రెడ్డి
అన్నారు.
బాబు న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు.
ఒకే
హైకోర్టులో రెండు తీర్పులు ఎలా వస్తాయని
ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు తప్పు చేయనప్పుడు స్టే
ఎందుకు తెచ్చుకున్నారని
మరో నేత
శోభా నాగి
రెడ్డి ప్రశ్నించారు.
Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సోనియా కాళ్లు పట్టుకుంటాడు - లక్ష్మీ
పార్వతి
టిడిపి అధినేత
చంద్రబాబు నాయుడు అవసరమైతే ఏఐసిసి అధ్యక్షురాలు
సోనియా గాంధీ
కాళ్లు కూడా
పట్టుకుంటారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ
పార్వతి
అన్నారు.
కోర్టు తీర్పుతో తాను నీతివంతుడనని
చంద్రబాబు చెబుతున్నారని,
ఆయన ఏ తప్పు
చేయలేదని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా..?
అని ప్రశ్నించారు.
ప్రజలు వ్యతిరేకించారు
కాబట్టే రెండుసార్లు
ఆయన ఓడిపోయారన్నారు.
కోర్టుల ద్వారా
కొందరు దోపిడీదారులు,
హంతకులు,
స్మగ్లర్లు ఎలా బయటపడుతున్నారో చంద్రబాబు కూడా అలాగే బయటపడ్డారన్నారు.
రాష్ట్ర ప్రజలకు
వాస్తవాలు పూర్తిగా తెలుసని, చంద్రబాబుకు విలువలు లేవని అన్నారు.
బాబు తన
తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విచారణ
జరపకుండానే కేసుల నుండి బయటపడుతున్నారన్నారు.
అలాంటి వ్యక్తి నీతివంతుడా అని
ప్రశ్నించారు.
దొంగలా ఎన్నాళ్లు తప్పించుకుంటారు అన్నారు.
తాను
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్
జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నానని అన్నారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఏం నేను..
ఆడదానిలా కన్పించడంలేదా..!?
శ్యామలా
ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న 'జోగిని' ఆచారంపై పోరాటాలు చేస్తూ ఈ దురాచారాన్ని రూపుమాపడానికి మా వంతు చేస్తున్న ప్రయత్నమే ఈ 'వీరంగం' చిత్రమంటున్నారు.. నిజ జీవితంలో జోగిని పాత్ర పోషించిన శ్యామలా దేవి.
ఈ చిత్రంపై అన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో.... ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రంలో నటించినందుకు విశ్లేషకులు కూడా అభినందిస్తున్నారని తన ఆనందాన్ని పంచుకున్నారు నటి శ్యామలాదేవి.
ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్యూ.....
ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు వేముగంటి గారికి, నిర్మాత శ్రీనివాస యాదవ్ గారికే చెందని ఆమె అన్నారు. జోగినిలు ఈ వ్యవస్థలో ఎంతటి దురాచారాలకు గురవుతున్నారో నా ద్వారా బయటి ప్రపంచానికి తెలియడం చాలా సంతోషంగా ఉందన్నారు అన్ని రంగాల్లో ఇంత అభివృద్ధి సాధించిన మనం వందల ఏళ్ళ క్రితం కాకతీయుల కాలంలో ఏర్పడ్డ దేవదాసి-జోగిని అనే ఈ దురాచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుండడం దురదృష్టకరం. ఇక తాను పోషించిన పాత్రకు ఇంటా బయటా మంచి రెస్పాన్స్ వస్తోందాని తెలిపారు. తాను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. నా ఏడేళ్ళ ప్రాయం నుండి బోనాలు ఎత్తుకుని ఆడేదానన్ని . అప్పటి నుండీ నా ఈ ప్రస్థానం మొదలైందని పెద్దగా చదువుకోలేదనీ, జీవితాన్ని చదివానని తెలిపారు. మీరు ఆడా? మగా? అనే అనుమానం చాలామందిలో ఉందన్న ప్రశ్నకు సంమాదానమిస్తూ... ఏం నేను.. ఆడదానిలా కన్పించడంలేదా.. ఎవరెవరో ఏదో అనుకుంటున్నారు. అవన్నీ పుకార్లు మాత్రమే. కాకతీయుల కాలంలో కేవలం రాజులు మాత్రమే దేవదాసి లను అనుభవించేవారని.., . కాలక్రమేపీ ఆ గ్రామ పెత్తందార్లు దేవదాసిలను, జోగిని లుగా పిలవబడే ఈ అమాయక పేదవారిని బలవంతంగా తమ లైంగిక అవసరాలను తీర్చుకునేవారని తెలిపారు. ఇప్పటికీ ఆరు రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఈ దురాచారం కొనసాగుతోంది. తాను నిజ జీవితంలో పోషించిన పాత్రే ఇందులో కూడా పోషంచానని. ఐతే కథలో భాగంగా కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో కూడా నటించడం జరిగిందని అన్నారు. అయితే ఇప్పుడు లక్షల మంది భక్తులు నేను అలా నటించడం పట్ల కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినా సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప చిత్రంలో నటించినందుకు గర్వ పడుతున్నానన్నారు.
ఇది అందరూ చూడతగ్గ సినిమాఅని తెలిపారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి